నటసింహం బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా తాజాగా మోక్షజ్ఞ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలో మోక్షజ్ఞ తన కొత్త ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకున్నాడు. మోక్షజ్ఞ తన స్టైల్ తో పాటు క్లాసిక్ ఎథ్నిక్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఈ ఫోటో చూసిన నందమూరి ఫ్యాన్స్ కొందరు మోక్షజ్ఞ తెరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడని.. ఇక బాక్సాఫీస్ షేకే అని కామెంట్స్ చేస్తున్నారు. ‘నందమూరి మోక్షజ్ఞ’ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఓపెనింగ్ అనేది అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినిమా పై ఇప్పుడు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆదిత్య 999 సినిమానే మోక్షజ్ఞ మొదటి సినిమా, ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుందని టాక్.


