బిగ్ బాస్ 4 – మోనాల్ కు ఆ సీజన్స్ కే పిలుపు వచ్చిందట.!

బిగ్ బాస్ 4 – మోనాల్ కు ఆ సీజన్స్ కే పిలుపు వచ్చిందట.!

Published on Dec 16, 2020 8:01 AM IST

monal 1

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసేసి నాలుగో సీజన్లోకి అడుగు పెట్టి దానిని కూడా పూర్తి చేసుకోనుంది. అయితే ఈసారి సీజన్లో మంచి హాట్ టాపిక్ అయిన కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్. ఎలిమినేషన్ అనే మాట వచ్చిన ప్రతీసారీ ఆమె పేరు వినిపిస్తుంది.

మొత్తానికి ఎలాగో పలుమార్లు సేవ్ అవుతూ వచ్చిన ఈ కంటెస్టెంట్ సరిగ్గా ఫైనల్ ఎలిమినేటర్ గా నిలిచి బయటకు వచ్చేసింది. అయితే అలా వచ్చాక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలనే చెప్పింది. నిజానికి ఈమెకు బిగ్ బాస్ షోకు అవకాశం ఇప్పుడు వచ్చిందే కాదట గత రెండో సీజన్ అలాగే మూడో సీజన్ కు కాల్ వచ్చిందట.

రెండో సీజన్ కు ఏదో కారణం వల్ల కాలేదు కానీ మూడో సీజన్ కు కాల్ వచ్చినపుడు తాను యూఎస్ లో ఉన్నానని తెలిపింది. అందుకు కుదరలేదని తెలిపింది. అలాగే తాను తెలుగు నేర్చుకోడానికి అసలు కంటెస్టెంట్స్ ఎలా మాట్లాడుకుంటున్నారో అని మొదటి రెండు సీజన్లు సగం చూసానని నాలుగో సీజన్ అయితే మొత్తం చూసేసానని తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు