అంచనాలు పెంచుతున్న “మనీ హేస్ట్ 5” వాల్ 1 ట్రైలర్.!

Published on Aug 3, 2021 8:00 am IST


మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓటిటిలో భారీ హిట్ కాబడిన నెంబర్ 1 వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది “ది మనీ హేస్ట్” సిరీస్ అని చెప్పాలి. స్పానిష్ కి చెందిన ఈ వెబ్ సిరీస్ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది. అయితే మొత్తం నాలుగు సూపర్ హిట్ సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ బిగ్గెస్ట్ హిట్ సిరీస్ నుంచి ఇప్పుడు ఫైనల్ సీజన్ కి చెందిన పార్ట్ 1 ట్రైలర్ బయటకి వచ్చింది.

ఇది ముందు సీజన్లకి మించిన స్థాయిలోనే ఉందని చెప్పాలి. ప్రొఫెసర్ దొరికిపోవడం దగ్గర నుంచి వారి టీం బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో అక్కడి పోలీస్ ఫోర్స్ తో భీకర యుద్ధం చేసే సన్నివేశాలు అందుకు దారి తీసిన అంశాలు సింపుల్ గా ఈ ట్రైలర్ లో చూపించడం చాలా ఆసక్తిగా ఉంది. అలాగే ఈసారి బెర్లిన్ రోల్ మళ్ళీ కనిపించనున్నట్టుగా కూడా కనిపిస్తుంది.

అలాగే రకెల్ మొరియో తమ టీం ని లీడ్ చేస్తుండడం టోక్యో రోల్ పై కూడా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూపించడం ఈ ట్రైలర్ తో ఈ సీజన్ పై మరిన్ని అంచనాలు పెంచింది. అయితే ప్రొఫెసర్ రోల్ కి ఇందులో ఎండ్ కార్డ్ పడుతుందా అన్న డౌట్ కూడా కలుగుతుంది. మొత్తానికి మాత్రం మంచి ఎంగేజింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ ఈ సీజన్ పార్ట్ 1 పై చాలా అంచనాలు పెంచింది.

మరి ఈ సీజన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకో నెల ఆగాల్సిందే.. వచ్చే సెప్టెంబర్ 3 న ఈ సీజన్లో వాల్యూమ్ 1 నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి ఈ హిట్ సిరీస్ ని తెరకెక్కించిన జీసస్ కాల్మెనర్ అని కూడా తెలుసుకోండి..

ట్రైలర్ కోసం కూడా ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :