రాజమౌళి అవార్డుతో ఒక్కసారిగా పెరిగిన నమ్మకం.!

రాజమౌళి అవార్డుతో ఒక్కసారిగా పెరిగిన నమ్మకం.!

Published on Dec 4, 2022 7:04 AM IST

లేటెస్ట్ గా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ గ్లోబల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో వరల్డ్ వైడ్ తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తాను తీసుకెళ్లగా ప్రసిద్ధ అవార్డు ఆస్కార్ ఖచ్చితంగా వస్తుందని అంతా స్ట్రాంగ్ గా నమ్మారు. అయితే ఈ చిత్రానికి ఆస్కార్ రావాలని ఫారిన్ ఆడియెన్స్ కూడా కోరుకుంటూ ఉండగా వారి నమ్మకం అలాగే మన తెలుగు సినిమా లవర్స్ పెట్టుకున్న నమ్మకం నిజం అయ్యేలా సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ గా అయితే రాజమౌళి కి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి అవార్డు రావడంతో డెఫినెట్ గా ఆస్కార్ ఛాన్స్ లు 90 శాతం మేర ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వారు గత రెండు దశాబ్దాలు నుంచి ఎంపిక చేసిన బెస్ట్ దర్శకుల్లో 22 కి గాను 16 సార్లు ఆ చిత్రాలు కానీ దర్శకులు గాని ఆస్కార్ కి ఎంపిక అవడం విశేషం. మరి ఈ కొలమానంతో అయితే డెఫినెట్ గా ఆస్కార్ బరిలో RRR పేరు వినిపించడానికి గట్టి ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది. దీనితో రాజమౌళి ఎంపిక మరింత నమ్మకాన్ని ఇప్పుడు తీసుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు