“సర్కారు వారి పాట”కు మరిన్ని బాలీవుడ్ హంగులు?

Published on Sep 16, 2020 8:07 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గత మూడు చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకునే సరికి అదే హ్యాట్రిక్ జైత్ర యాత్రను తిరిగి మహేష్ కొనసాగించాలని మహేష్ మరియు అతని అభిమానులు అనుకొంటూ మొదలు పెట్టిన కమెర్షియల్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తో ప్లాన్ చేసిన ఈ మాస్ ఫ్లిక్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

బహుశా ఈ చిత్రాన్ని కనుక ప్లాన్ చేస్తే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లా ప్లాన్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అనీల్ కపూర్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపిస్తారని టాక్ వచ్చింది. ఇప్పుడు మరింత బాలీవుడ్ హంగులు అద్దుతూ ఈ చిత్రంలో మహేష్ కు సోదరిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ ను చిత్ర యూనిట్ లాక్ చేసిన్నట్టుగా టాక్. మరి ఇవే కనుక నిజం అయితే ఈ చిత్రంతోనే మహేష్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More