థలపతి “మాస్టర్” స్ట్రీమింగ్ పై మరింత క్లారిటీ.!

Published on Jan 27, 2021 8:00 am IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్ట్రాంగ్ విలన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్”. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా వచ్చింది. మరి అలాగే ఈ చిత్రానికి గాను అన్ని చోట్లా కూడా భారీ ఓపెనింగ్స్ తో పాటుగా బ్రేకీవెన్ కూడా దక్కింది.

అయితే ఈ సినిమా విడుదలకు ముందు గానే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి భారీ ఆఫర్స్ రాగా ఓటిటి విడుదలను వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు ఎలాగో థియేటర్స్ లో వచ్చేయడంతో ప్రైమ్ వీడియోలో రిలీజ్ కు డేట్ కుదిరింది. ఈ జనవరి 29నే ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చెయ్యడం ఫిక్స్ అయ్యింది.

అయితే అది ఒక్క తమిళ్ వెర్షన్ లోనేనా లేక మిగతా అన్ని భాషల్లో కూడానా అన్న దానిపై క్లారిటీ వినిపిస్తుంది. ఆరోజు తమిళ్ తో పాటుగా తెలుగు హిందీ మరియు ఇతర భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్టు టాక్. మరి ఈ సినిమా అన్ని భాషల్లో వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ సాలిడ్ చిత్రానికి అనిరుధ్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇవ్వగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :