బిగ్ బాస్ 4 – ఈ ఇద్దరి మధ్య మరింత దూరం.!

Published on Dec 4, 2020 8:00 am IST

ఇప్పుడు బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫైనల్ స్టేజ్ కు వస్తుండడంతో ఉన్న కాస్త కంటెస్టెంట్స్ లో కూడా మరిన్ని కొత్త చీలికలు వస్తున్నాయి. ఇన్నాళ్లు కలిసి ఉన్న వారు విడిపోతున్నారు. వారు ఇంకొకరితో కలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న కొద్ది మందిలో కొన్ని జంటలు పరంగా వీక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఆ జంటలో అఖిల్, మోనాల్ లది అలాగే అభిజిత్ అండ్ హారిక, అరియనా మరియు షోయెల్ ల జంటలు మైన్. అయితే వీరిలో అభిజీత్ మరియు హరికల నడుమ మరింత గ్యాప్ పెరిగినట్టు నిన్నటి ఎపిసోడ్ లో కనిపిస్తుంది. అభి తన సమస్య ఏదో చెప్పుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.

కానీ అంతా ఇంగ్లీష్ లో చెప్తుంటే హారికా తెలుగులో మాట్లాడాలి అని మినిమమ్ రూల్ చెప్పింది ఇక్కడ తాను చెప్పింది పాయింటే. అంతే దానితో అభిజీత్ తన బాధ వినిపించుకోవట్లేదు తాను ఏం పాయింట్ మాట్లాడానో కూడా అర్ధం చేసుకోలేదని వెళ్ళిపోయాడు.

ఇక ఆ తర్వాత మళ్ళీ హారిక వచ్చి సారి చెప్పినా అభి ఒప్పుకోలేదు. దీనితో హారిక కూడా ఓకే అని వెళ్ళిపోయింది. ఇన్ని రోజులో మంచి హాట్ టాపిక్ గా ఉండే ఈ జంట ముందు రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More