మరింత సంబరంగా 2025 సంక్రాంతి బాక్సాఫీస్ ?

మరింత సంబరంగా 2025 సంక్రాంతి బాక్సాఫీస్ ?

Published on Apr 9, 2024 10:40 PM IST

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని అలరించాయి. ఇక వాటిలో కొన్ని భారీ సక్సెస్ సొంతం చేసుకోగా మరికొన్ని యావరేజ్ విజయం అందుకున్నాయి. అయితే రానున్న 2025 సంక్రాంతి మరింత సంబరంగా మారనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పలు బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఆడియన్స్ కి వీనుల విందు అందించేందుకు సిద్ధం అవుతున్నాయి.

ముందుగా వాటిలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ జనవరి 10న విడుదల కానుంది. అలానే వెంకటేష్ తో అనిల్ రావిపూడి తీయనున్న సంక్రాంతి కి వస్తున్నాం మూవీ కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇక మాస్ మహారాజా రవితేజ తో యువ దర్శకుడు భాను తీస్తున్న మూవీని కూడా అదే సమయంలో రిలీజ్ చేయనున్నట్లు నేడు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక త్వరలో నాగార్జున హీరోగా ప్రారంభం కానున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూడా అదే టైం లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

వీటితో పాటు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ మూవీ కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు బజ్. చివరిగా మరొక రెండు లేదా మూడు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి బాక్సాఫిస్ రేస్ లో నిలవనున్నాయట. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రానున్న 2025 సంక్రాంతి బాక్సాఫీస్ నిజంగా మరింత సంబరంగా మారనుందని తెలుస్తోంది. అయితే అప్పటికి ఒకింత పరిస్థితుల మార్పు వలన ఒకటి రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మారే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు