బాహుబలి కంటే పది రేట్లు గూజ్ బంప్స్.. !

Published on Jul 6, 2020 9:07 am IST

ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా అందరీ కళ్ళు ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ మల్టీస్టారర్ పైనే ఉన్నాయి. వచ్చే వేసవి నాటికి ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. బాహుబలి లాంటి చారిత్రాత్మక విజయం తరువాత, దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆర్ఆర్ఆర్ పై ప్రత్యేక అంచనాలు చాలా ఉన్నాయి. అయితే బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ యొక్క తమిళ వెర్షన్ డైలాగ్ రచయిత మాధన్ కార్కీ తాజా ఇంటర్వ్యూలో చేసిన ప్రకటన ఆర్ఆర్ఆర్ పై హైప్ ను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. బాహుబలి కంటే పది రేట్లు గూజ్ బంప్స్ తెప్పించే సీన్స్.. ఆర్ఆర్ఆర్ ప్రారంభం నుండే అలాంటి సన్నివేశాలు ఉంటాయని మాధన్ చెప్పారు’ అని మాధన్ అన్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఇప్పటికే 80% షూట్ పూర్తి చేసుకుంది. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా విదేశీ భామ ‘ఒలివియా మోరిస్’ నటించనుంది. అలాగే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ రెండు నిముషాల పాటు కనిపిస్తోందట. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకా కొత్త కాలం ఎదురుచూడాల్సిందే.

కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2021 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More