మహేష్ బర్త్ డే కి చాలా ఆసక్తి రేపుతున్న ఈ అప్డేట్స్.!

Published on Jul 25, 2021 8:37 am IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి అదిరే అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆ తరుణం ఇంకొన్ని రోజుల్లో నెరవేరనుంది.

ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా నుంచి కీలక అప్డేట్స్ మిస్ అయ్యాయి. దీనితో మహేష్ బర్త్ డే కే అన్ని ట్రీట్స్ ను ఇవ్వాలని మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. అయితే వచ్చే ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ అయితే పక్కా అని తెలుస్తుంది కానీ అది కాకుండా వచ్చే మిగతా అప్డేట్స్ విషయంలోనే మరింత ఆసక్తి రేగుతుంది.

ప్రస్తుతానికి ఉన్న టాక్స్ ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ అలాగే టీజర్ గ్లింప్స్ ఇంకా మేకింగ్ వీడియో ఈ మూడింటిపై ఫస్ట్ లుక్ కాకుండా బజ్ వినిపిస్తుంది. మరి వీటిలో ఏది ఫస్ట్ లుక్ తో పాటు వచ్చి మహేష్ బర్త్ డే ని మరింత స్పెషల్ డే గా మారుస్తుందో చూడాలి..

సంబంధిత సమాచారం :