తారక్ కొత్త షో ఫస్ట్ ఎపిసోడ్ పై మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jul 22, 2021 9:00 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భారీ సినిమాలో బిజీగా ఉన్న సంగతి అందరకీ తెలిసిందే.. అలాగే ఈ సినిమా అనంతరం కూడా సాలిడ్ లైనప్ తో తారక్ రెడీ అవుతున్నాడు. అయితే వీటితో పాటుగా తారక్ మళ్ళీ చాలా కాలం అనంతరం స్మాల్ స్క్రీన్ పై తన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించడానికి రెడీ అయ్యిపోయాడు.

అప్పుడెప్పుడో బిగ్ బాస్ షో తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతే గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” షోతో పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ షో మొదటి ఎపిసోడ్ పై ఆసక్తికర విషయాలే వినిపిస్తున్నాయి. ఈ మొట్టమొదటి ఎపిసోడ్ కి గాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రానున్న సంగతి తెలిసిందే..

అలాగే రెండు డేట్స్ లో ఈ షో ఆగష్టు 15వ తారీఖునే టెలికాస్ట్ కావడానికి రెడీగా ఉందట. అంతే కాకుండా ఈ మొదటి ఎపిసోడ్ లో చరణ్ ఎంతతైతే గెలుచుకుంటారో ఆ మొత్తం కూడా ఛారిటీకే బదిలీ చేయనున్నట్టుగా మరో ఆసక్తికర టాక్. ఏది ఏమైనప్పటికీ మాత్రం “RRR” ఇద్దరు స్టార్ హీరోలని మాత్రం ఒకే స్టేజ్ పై ఇంకాస్త ముందే చూడాలని ప్రేక్షకులు అంతా ఉవ్విళ్ళూరుతున్నారు.

సంబంధిత సమాచారం :