పవర్ ఫుల్ “సలార్” పై మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్.!

Published on Dec 3, 2020 7:01 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఒకదాన్ని మించి మరొకటి పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ కు తన దమ్ము ఏంటో ఓ రేంజ్ లో చూపించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అలా లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “సలార్”పై భారీ ఎత్తున అంచనాలు ఏర్పడిపోయాయి.

గత కొంత కాలం నుంచి గాసిప్ గా వినిపించిన సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. వీటికి తోడు అనౌన్స్మెంట్ పోస్టర్ తో టైటిల్ ను కూడా అనౌన్స్మెంట్ చెయ్యడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. అయితే ఇప్పుడు ఈ భారీ చిత్రానికి సంబంధించి మరింత సమాచారం తెలుస్తుంది.

ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ ఒక పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారట. అంతే కాకుండా పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఎంచుకొన్నారని తెలుస్తుంది. సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట.

అంతే కాకుండా ఈ చిత్రాన్ని రాధే శ్యామ్ పూర్తయిన వెంటనే మొదలు పెట్టేసి అంతే త్వరగా ఫినిష్ చేస్తారట. సో ఈ చిత్రం కూడా విడుదల కూడా అంతే తొందరగా ఉందనున్నట్టు సమాచారం. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More