‘సరిలేరు నీకెవ్వరు’లో కొత్త సీన్స్ కలవబోతున్నాయి !

Published on Jan 22, 2020 9:00 pm IST

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా మొదటి షో నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. మొత్తం మీద మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలవడం విశేషం. కాగా తాజాగా ఈ సినిమా మేకర్స్ ప్రెస్‌ మీట్ ను పెట్టారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. ఈ శుక్రవారం నుండి ఈ చిత్రంలో మరికొన్ని సన్నివేశాలు చేర్చబోతునట్లు వెల్లడించారు. మరి ఎలాంటి సీన్స్ ను యాడ్ చేస్తారో చూడాలి.

కాగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న సినిమా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనే టాక్‌తో రికార్డ్ క‌లెక్షన్స్‌ను సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్నాడు. అయితే మరో రెండు నెలలు గ్యాప్ తీసికుని.. ఆ తర్వాత నుండి వంశీ పైడిపల్లితో మహేష్ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More