సుశాంత్ కేసులో మరిన్ని నివ్వెరపోయే అంశాలు.!

Published on Sep 17, 2020 4:04 pm IST

గత కొన్ని నెలల కితం బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన ఘటన చుట్టూతా ఇంకా మిస్టరీ అలా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ వారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా చాలా అంశాలను బయటకు లాగుతున్నారు.

రోజుకో సరికొత్త అంశం బయటకొస్తున్న ఈ కేసు విషయంలో ఇప్పుడు మరో నివ్వెరపోయే అంశం బయటకొచ్చినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచీ సుశాంత్ సింగ్ స్నేహితుడు అయినటువంటి సిద్దార్థ్ పితానిను చేస్తున్న విచారణ చేయగా అతను మరిన్ని షాకింగ్ అంశాలను బయటపెట్టాడు.

సుశాంత్ చనిపోక ముందు అతని మాజీ మేనేజర్ దిశా చనిపోయిన తర్వాత అతన్ని కూడా చంపేస్తారని అనేవాడని, తాను సెక్యూరిటీ కూడా పెంచుకోవాలి అనుకున్నాడని అలాగే అతని లాప్టాప్ మరియు ఇతర హార్డ్ డ్రైవ్ లను పట్టుకెళ్లింది అని అతను ఈ విచారణలో తెలిపాడట. మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More