“ఆచార్య” రిలీజ్ పై నయా స్పెక్యులేషన్స్ ఇవే.!

Published on Aug 28, 2021 7:07 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రం ఒక భారీ మల్టీ స్టారర్ కూడా. మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రిలీజ్ ప్రస్తుతం సినీ వర్గాల్లో అలా సస్పెన్స్ కొనసాగుతుంది.

అయితే ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్న దానిపై రకరకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం మూడు సీజన్లలో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అంటూ టాక్. మొదటగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా తర్వాత సంక్రాంతి ఆ తర్వాత మహా శివరాత్రి కానుకగా వీటిలో ఏదొక సీజన్ కి రిలీజ్ అవుతుంది అని ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఆచార్య రిలీజ్ ఎప్పుడు అవుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :