అన్నీ చిన్న సినిమాలే.. కానీ పోటీనే పెద్దది !

Published on Nov 19, 2019 12:00 am IST

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు గట్టి పరీక్షే పెడుతున్నారు మన ప్రేక్షకులు. మొదటి రెండు రోజులు మౌత్ టాక్ బాగుంటేనే మూడో రోజు థియేటర్ల వైపు చూస్తున్నారు. దీంతో సోలో రిలీజ్ దొరికినా ఓపెనింగ్స్ సాధించడం చిన్న చిత్రాలకు బాగా కష్టమైపోయింది. అలాంటిది ఈ శుక్రవారం 22వ తేదీ ఏకంగా ఆరు చిన్న చిత్రాలు విడుడలకు సిద్దమయ్యాయి.

వాటిలో ప్రమోషన్లతో అదరగొడుతున్న ‘జార్జ్ రెడ్డి’ ఒకటి కాగా, ఈషా రెబ్బ, సత్యాదేవ్ నటించిన ‘రాగల 24 గంటల్లో’, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ నటించిన ‘తోలుబొమ్మలాట’, చేతన్ మద్దినేని నటించిన ‘బీచ్ రోడ్ చేతన్’ ఇంకా ‘పిచ్చోడు, ట్రాప్’ ఇలా మొత్తం 6 సినిమాలున్నాయి. అలాగే ‘ఫ్రోజెన్ 2, జాక్ పాట్’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.

మరి వీటిలో ఏవీ చివరి నిమిషంలో వాయిదా పడకుండా అనుకున్నట్టే 22న విడుదలైతే.. కాస్త గట్టి పోటీనే నెలకొనే అవకాశముంది. కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఏ చిత్రాలైతే ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటుందో అవే మెరుగైన ఓపెనింగ్స్ రాబట్టుకోగలవు.

సంబంధిత సమాచారం :

More