మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ “ట్రైలర్” కి సర్వం సిద్ధం!

Published on Sep 30, 2021 12:14 pm IST


అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం ను గీతా ఆర్ట్స్ 2 పతాకం పై బన్నీ వాసు, వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, ప్రచార చిత్రాలు, టీజర్ సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను నేడు సాయంత్రం 6:10 గంటలకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు పోస్టర్ ను సైతం విడుదల చేసింది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :