ఇటీవల విడుదలై భారీ లాభాలను తీసుకువచ్చిన టాలీవుడ్ సినిమాలు !

Published on Jan 29, 2019 2:22 pm IST

బాహుబలి కలెక్షన్ల పరంగా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. ఇండియాన్ సినీ చరిత్రలో ఈ సినిమా రికార్డులను క్రాస్ చేయడం ఇప్పట్లో జరుగని పని. ఇక ఈ చిత్రం తరువాత ఇటీవల టాలీవుడ్లో విడుదలైన కొన్ని చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకువచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ జాబితాలో మొదటిగా చెప్పుకొనే చిత్రం రంగస్థలం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం గత ఏడాది వేసవి లో విడుదలై 200కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం 80కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా 120కోట్లకు పైగా షేర్ ను రాబట్టి 40కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

ఈజాబితాలో రెండవ సినిమా గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది ఆగస్టు లో విడుదలై 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. మీడియం బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 70కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొచ్చింది.

ఇక ఈజాబితాలో చివరి సినిమా ఎఫ్ 2. ఈ ఏడాదిలో సంక్రాంతికి విడుదలై ఇప్పటికీ థియేటర్లలో మంచి రన్ ను కనబరుస్తుంది ఈ చిత్రం. వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రం ఇప్పటికే 70కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈచిత్రం ఫుల్ రన్ లో ప్రాఫిట్స్ విషయంలో రంగస్థలం , గీత గోవిందం రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More