మరో భారీ కాంబో సెట్ చేస్తున్న ‘మిస్టర్ బాక్సాఫీస్’..?

Published on Aug 1, 2021 5:27 pm IST


మిస్టర్ బాక్సాఫీస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రెండు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తుండగా ఒకటి పాన్ ఇండియన్ లెవెల్లో రచ్చ చేయనుంది. మరి వీటి తర్వాత మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వార మరో బిగ్గెస్ట్ కాంబోలో చరణ్ సినిమా చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

మన ఇండియన్ సినిమా దగ్గర భారీ యాక్షన్ థ్రిల్లర్ ప్రభాస్ తో చేసిన “సాహో” మేకర్స్ ఈ చిత్రాన్ని చేయనున్నట్టుగా సినీ వర్గాల్లో నయా టాక్.. అలాగే అదే చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ నే ఈ సినిమా కూడా చేయనున్నాడని తెలుస్తుంది.

అయితే సాహో కి కథ పరంగా సుజీత్ అంతగా మెప్పించకపోయిన తన మైండ్ లోని విజువల్స్ తో ఇండియన్ సినిమా దగ్గర ఒక సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని మాత్రం అందించాడు. మరి ఈ సెన్సేషనల్ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో ఈ టాక్ రియాలిటీ గా ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :