రెండవ రోజు డ్రాప్ అయిన మిస్టర్ మజ్ను కలెక్షన్స్ !

Published on Jan 27, 2019 12:15 pm IST

అఖిల్ , హలో చిత్రాల తరువాత అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈచిత్రం మొన్న విడుదలై మిక్సడ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ ప్రభావం చిత్ర కలెక్షన్స్ ఫై పడింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.24కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదనిపించిన ఈచిత్రం రెండవ రోజు 2.50 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో 7.40 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.

ఇక ఈ చిత్రం అటు ఓవర్సీస్ లోకూడా యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుటుంది. ఈ చిత్రం తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొడదామనుకున్న అఖిల్ కు మరోసారి ఎదురుచూపులు తప్పేలా లేవు.

ఇక మొదటి సినిమా తొలిప్రేమ తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రంతో వరుసగా రెండవ విజయాన్ని ఖాతాలో వేసుకోలేకపోయాడు. బివి ఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :

X
More