‘మిస్టర్ మజ్ను’ ‘ఎఫ్ 2’ ‘వివిఆర్’ల కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 28, 2019 10:48 am IST

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రెవిన్యూని రాబడుతూ ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

ఇక ఎఫ్ 2 ఆదివారం నాడు, కృష్ణ జిల్లాలో రూ. 17.95 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. మొత్తం 16 రోజులకు గానూ రూ .4.67 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కృష్ణ ప్రాంతంలో 5 కోట్ల రూపాయల మార్క్ ను దాటడానికి సిద్ధంగా ఉంది.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్మజ్ను’. అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏవరేజ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక కృష్ణ జిల్లాలో ఈ చిత్రం ఆదివారం నాడు 12.39 లక్షల షేర్ ను వసూలు చేసింది. దీంతో మొత్తం 3 రోజులకు గానూ 57.64 లక్షల షేర్ ను రాబట్టగలిగింది.

చివరగా, మెగా పవర్ సార్ట్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’, కృష్ణాలో నిన్న కేవలం రూ .1.31 లక్షల రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టి 17 రోజులకుగానూ ఈ చిత్రం అక్కడ 3.73 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :

X
More