ఇంటర్వ్యూ : ఎం.ఎస్.రాజు – ‘డర్టీ హరి’లో మంచి కంటెంట్ ఉంటుంది!

Published on Dec 12, 2020 7:00 pm IST

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరో హీరోయిన్లు. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

 

మీది చాల పెద్ద కెరీర్.. ఎలా అనిపిస్తోంది ?

 

ముప్పై ఏళ్ల నా కెరీర్ లో.. ఎన్నో చూశాను. నా జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. నేను డౌన్ లో ఉన్న ప్రతిసారి ఏదొక సినిమా సూపర్ హిట్ అయి నాకు మంచి ఎనర్జీ ఇచ్చేది. మూడేళ్లు ప్లాప్స్ వచ్చినప్పుడు దేవి సినిమా వచ్చి నన్ను ఆడుకుంది. నా కెరీర్ లో అలా చాల సంఘటనలు ఉన్నాయి.

 

డైరెక్షన్ వైపు ఎందుకు మొగ్గు చూపారు ?

 

గత మూడు నాలుగు సంవత్సరాల నుండే నాకు డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. అలా కొన్ని ఆలోచనలు తరువాత డర్టీ హరి చేయాలని ఫిక్స్ అయ్యాను.

 

కానీ మీ ఇమేజ్ కి భిన్నంగా బోల్డ్ కంటెంట్ తో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది ?

 

ఈ కథ నాకు బాగా అనిపించింది. అయితే బోల్డ్ కంటెంట్ అని నేను ఆలోచిస్తోన్న సమయంలో.. మా మిత్రుడు గూడూరు శివరామకృష్ణగారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. కేవలం ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ సినిమా చేశాను. ఆర్ధికంగా కూడా ఆయనే మొత్తం చూసుకున్నారు. అలా ఈ సినిమా మొదలైంది.

 

మీరు ఈ సినిమా చేస్తోన్న క్రమంలో మీ ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది. ?

 

ఈ కథను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూర్చోబెట్టి చెప్పాను. అందరూ పూర్తి అంగీకారం తెలిపిన తరువాతే.. ఈ సినిమా చేశాను.

 

ఈ సినిమా హీరోయిన్ గురించి ?

 

నిజానికి నేను ఈ సినిమాలో కొత్త హీరోయిన్ చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యాను. అయితే సిమ్రాన్ టీంలో ఎంటర్ అయ్యాక ఆమె చాల బాగా నటించింది. ఆ క్యారెక్టర్ ను అర్ధం చేసుకుని తను చాల బాగా నటించింది. అలాగే హీరో కూడా బాగా నటించింది.

 

మీరు పెద్ద పెద్ద సినిమాలు చేసి.. మళ్ళీ చిన్న సినిమాతో జర్నీ స్టార్ట్ చేయడం ఎలా అనిపించింది ?

 

అదే మీరు అర్ధం చేసుకోవాలి. పెద్ద పెద్ద సినిమాలు చేసిన నేను, ఒక చిన్న సినిమా గురించి ఇంత నమ్మకంగా ఉన్నాను అంటే.. అర్ధం చేసుకోవచ్చు.

 

ఈ సినిమా ప్రాసెస్ లో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ?

 

మా సినిమా టీం అండి, ఆర్ట్ డిపార్ట్ మెంట్ దగ్గర నుండి మేకప్ అండ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ఇలా ప్రతి ఒక్కరూ చాల బాగా సపోర్ట్ చేశారు.

 

డిజిటల్ రిలీజ్ పై మీకు ఏమనిపిస్తోంది ?

 

డిజిటల్ ప్లాట్ ఫామ్ చాల స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి యాప్ ఎలా వాడాలో అర్ధం అవుతుంది. ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు టీవీ కంటే కూడా డిజిటల్ ఫీల్డ్ చాల బాగా ఎదిగింది. అందుకే మా సినిమాని ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా విడుదల చేస్తున్నాము.

 

ఈ సినిమా చూసిన తరువాత మీ సన్నిహితుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది ?

 

సినిమా చూసి వాళ్ళు థ్రిల్ అయ్యారు. సినిమాలో బోల్డ్ ఒక్కటే.. మంచి కంటెంట్ ఉందని సినిమా చూసిన తరువాత అందరూ కామెంట్స్ చేశారు. బన్నీ వాసు కూడా సినిమా చూసాకే.. ఈ సినిమాని తీసుకున్నారు.

సంబంధిత సమాచారం :

More