ఆలియా – రణబీర్ ల పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

Published on Apr 5, 2022 2:00 pm IST


బాలీవుడ్ కి చెందినటువంటి బిగ్ స్టార్స్ హీరోయిన్ ఆలియా భట్ మరియు టాలెంటెడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ లు చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఇద్దరి ప్రయాణం పెళ్లి వరకు వెళ్ళబోతున్నట్టుగా ఇప్పుడు బాలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఇదే ఏప్రిల్ నెలలో ఈ యంగ్ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నెలలోనే వీరి వివాహానికి ముహూర్తం ఖరారు కాగా ఈ వివాహం రణబీర్ పూర్వీకుల ఇంట్లో తమ అందరి కుటుంబీకుల సమక్షంలో జరగనున్నట్టు సమాచారం.

మరి రీసెంట్ గా అయితే ఆలియా భట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమాలు మరియు “గంగూబాయి ఖతియావాది” సినిమాలతో పలకరించగా రణబీర్ కపూర్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో “యానిమల్” అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు అయితే “బ్రహ్మాస్త” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేశారు.

సంబంధిత సమాచారం :