మహేష్, త్రివిక్రమ్ ల సాలిడ్ ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు.?

Published on Jul 21, 2021 5:02 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ మసాలా డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వరుస సూపర్ హిట్ చిత్రాలు అనంతరం ఈ సినిమా వస్తుండడంతో దీనిపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక ఈ చిత్రం లైన్ లో ఉండగానే మరిన్ని సినిమాలు మహేష్ లైన్ లో పెట్టిన విషయం కూడా తెలిసిందే. మరి వాటిలో తన హ్యాట్రిక్ మ్యాజికల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాను ఓకే చేసి మళ్ళీ పాత రోజులు గుర్తు చేశారు.

అయితే మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యి చాలా కాలమే అయ్యింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి ముహూర్తం ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. వచ్చే ఆగష్టు 9 మహేష్ బర్త్ డే నాడే ఈ సినిమా అధికారికంగా ముహూర్తం జరుపుకోనున్నట్టు టాక్. అలాగే ఈ సినిమాని కూడా సర్కారు వారి పాట తోనే కలిపి ఏకకాలంలో కొనసాగించాలని ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ తో సినిమాపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :