టెంపర్ లాంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న మరో పోలీస్ డ్రామా ‘నాన్నకు ప్రేమతో’. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పోలీస్ అయినప్పటికీ ఫాదర్ సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వలన ఇంత సాఫ్ట్ టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. ఇప్పటికే లండన్ లో మేజర్ పార్ట్ షూట్ చేసిన ఈ చిత్ర టీం దసరా తర్వాత ఫైనల్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే స్పెయిన్ వెళ్ళే లోపు ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమాలను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తన తదుపరి సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉంటుందని ఖరారైంది.
ఈ సినిమాని దసరా కానుకగా స్టార్ట్ చేసి డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. ఇది కాకుండా దీని తర్వాత చేయనున్న సినిమాకి కూడా ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అలాగే, ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసేసాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొరటాల శివ తర్వాత ఎన్.టి.ఆర్ వక్కంతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేయబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాని కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఎన్.టి.ఆర్ – వంక్కంతం వంశీల సినిమాని 2016 ఏప్రిల్ లో అధికారికంగా లాంచ్ చేసి, అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించేలా ప్లాన్ ని సిద్దం చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళి ఏడాదికి రెండు సినిమాలను అందించాలనే ఆలోచనలో ఉన్నాడు.


