మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో హీరో, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి వరుణ్ తేజ్ ప్రస్తుతం తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ చెబుతున్నాడు.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ‘ముకుంద’ ఆడియోని నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు విషయాలపై త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాసహం ఉంది. ముకుంద ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.


