అఖిల్‌కు జోడీగా ముంబై మోడల్ ?

అఖిల్‌కు జోడీగా ముంబై మోడల్ ?

Published on Dec 30, 2020 1:43 AM IST

అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్. తాను స్టోరీ రాసేటప్పుడు తన మనసులో అఖిల్ మాత్రమే ఉన్నాడని, ఆయనలోని మాస్ యాంగిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ బయటపడలేదని, కానీ తన సినిమాతో బయటికొస్తుందని చెబుతో సినిమా గురించి, అందులో అఖిల్ పాత్ర గురించి సురేందర్ రెడ్డి భారీ హైప్ ఇచ్చారు. దీంతో అక్కినేని అభిమానుల్లో సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

సినిమాలో అఖిల్ సరసన నటించబోయే కథానాయకి కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నారు సురేందర్ రెడ్డి. ఈ వెతుకులాటలో భాగంగా ముంబై మోడల్ సాక్షి వైద్యను ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆమెకు ఫోటోషూట్ కూడ నిర్వహించారట సురేందర్ రెడ్డి. మరి ఆమెనే ఫైనల్ చేశారా లేకపోతే మార్పులేవైనా ఉంటాయా అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు