న్యూ ఇయర్ కానుకగా మరోసారి ‘మురారి’ ట్రీట్

న్యూ ఇయర్ కానుకగా మరోసారి ‘మురారి’ ట్రీట్

Published on Dec 20, 2025 2:30 AM IST

Murari

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. అయితే, ఈ లోపు తన ఫ్యాన్స్‌ను థియేటర్లలో పలకరించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

మహేష్ బాబు కెరీర్‌లో ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ చిత్రంగా ‘మురారి’ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాను న్యూ ఇయర్ ట్రీట్‌గా డిసెంబర్ 31న రీ-రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ సినిమాను మరోసారి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు