రకుల్‌ ప్రీత్‌ను హీరోయిన్‌గా ఖరారు చేసిన మురుగదాస్!

రకుల్‌ ప్రీత్‌ను హీరోయిన్‌గా ఖరారు చేసిన మురుగదాస్!

Published on Jul 14, 2016 12:24 PM IST

Rakul-Preet-and-mahesh-babu
సూపర్ స్టార్ మహేష్, సౌతిండియన్ పాపులర్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‍ల కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్నది మొదట్నుంచీ చర్చనీయాంశమే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా దాదాపుగా మహేష్‌కు హీరోయిన్‌గా ఖరారయ్యారని కొద్దిరోజుల క్రితంవరకూ వినిపించినా, ఈమధ్య ఎక్కువగా తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది.

ఇక ఈ ఇద్దరిలో మహేష్ హీరోయిన్ ఎవరన్న ప్రచారం అలా జరుగుతూనే ఉండగా, మురుగదాస్ కొద్దిసేపటి క్రితం స్పష్టమైన ప్రకటన ఇచ్చేశారు. మహేష్‌తో తాను చేయబోయే సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా ఖరారయ్యారని మురుగదాస్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా స్పష్టం చేశారు. ఇక మహేష్‌, మురుగదాస్‌‌ల సినిమాలో నటించే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నానని రకుల్ ఈ సందర్భంగా అన్నారు. హరీస్ జైరాజ్, సంతోష్ శివన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్-ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్ళనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు