ఇంటర్వ్యూ : చిరంతన్ భట్ – బాలీవుడ్ లో ఇంత గౌరవం, పేరు లభించవు !
Published on Dec 31, 2016 1:29 pm IST

charitan-bhatt
‘కంచె’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపట్టి మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు ‘చిరంతన్ భట్’ తెలుగులో చేస్తున్న రెండవ చిత్రం బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ మధ్యే ఘనంగా ఆడియో వేడుక జరుపుకుని మంచి ఆదరణ పొందుతున్న ఈ సినిమా ఆడియో గురించి ఆయన చెప్పిన విశేషాలు మీకోసం…

ప్ర) శాతకర్ణి ఆడియో రిలీజ్ వేడుక ఎలా ఉంది ?

జ) చాలా బాగుంది. చాలా గ్రాండ్ గా చేశారు. బాలీవుడ్ లో అయితే ఇంత గౌరవం ఉండదు. సిఎం చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గారు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది.

ప్ర) మరి పాటలకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది ?

జ) శాతకర్ణి పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి పాట చాలా బాగుంది అంటున్నారు. ఆ సినిమాలో పని చేయడం నా అదృష్టాంగా భావిస్తున్నాను.

ప్ర) ఈ పాటలు చేయడానికి ఎన్ని రోజూలు తీసుకున్నారు. ఏ పాటైనా డిఫికల్ట్ అనిపించిందా ?

జ) ఈ పాటలన్ని పూర్తి చేయడానికి 4 నెలలు పట్టింది. అన్నీ చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. డైరెక్టర్ క్రిష్ అన్ని విధాల హెల్ప్ చేశారు. ‘సాహో సార్వ భౌమ’ పాట కాస్త కష్టమనిపించింది. ఎందుకంటే అదే థీమ్ సాంగ్ కాబట్టి. బాగా రావాలని ఎక్కువ ష్టపడ్డాను.

ప్ర) ‘కంచె’ కు ఈ సినిమాకు తేడా ఏంటి ?

జ) ‘కంచె’ సినిమా ప్రపంచ యుద్దానికి సంబందించిన సినిమా కాబట్టి అందులో మ్యూజిక్ వేరుగా ఉంటుంది. ఈ ‘శాతకర్ణి’ చిత్రం మన దేశం, మన సంస్కృతి, మన రాజుకు సంబందించినది కనుక ఇందులో వేరే రకం సంగీతం ఉంటుంది.

ప్ర) లిరిక్స్ కు చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ?

జ) సీతారామ శాస్త్రిగారితో పని చేయడం నిజంగా నా అదృష్టం. ఆయనకు సరస్వతీ కటాక్షం ఎక్కువ. ఒక లిరిసిస్ట్ గానే కాక కవిగా చాలా గొప్ప వ్యక్తి. వయసులో పెద్దవారే అయినా మనసులో మా అందరికంటే కుర్రవాడు. ఎప్పుడూ జోకులు వేస్తూ నవ్విస్తుంటారు.

ప్ర) మరి ఆయన వాడే పదాలు మీకు కష్టంగా అనిపించలేదా ?

జ) అనిపించాయి. ఎందుకంటే నాకు తెలుగు అంతగా రాదు. సన్నివేశంలో భావాన్ని బట్టి సంగీతం కంపోజ్ చేస్తా. క్రిష్ దగ్గరుండి నాకు చాలా హెల్ప్ చేశాడు. కానీ తెలుగులో ఇంకా సినిమాలు చేయాలంటే భాష నేర్చుకోవాల్సిందే.

ప్ర) బాలకృష్ణ సినిమాకు పనిచేయడం ఎలా అనిపించింది ?

జ) బాలకృషగారి చేస్తున్న ఈ గొప్ప ప్రాజెక్టులో నేను కూడా భాగం కావడం ఆనందంగా ఉంది. దీనికి పని చేసేటప్పుడు ఇది బాలకృష్ణగారి 100వ చిత్రం చాలా స్పెషల్ అనుకుని ప్రెషర్ తీసుకుని మరీ పనిచేశాను.

ప్ర) మీ డైరెక్టర్ క్రిష్ పై మీ అభిప్రాయం ?

జ) క్రిష్ చాలా మంచి విజన్ ఉన్న వ్యక్తి. బయటి ప్రపంచంతో కలవనట్టే ఉంటాడు. కానీ అన్నీ తెలుసుకుంటాడు. ఎప్పుడూ తాను చేస్తున్న సినిమా సర్కిల్లోనే ఉండి పనిచేస్తుంటాడు. బాగా కష్టపడతాడు. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయగలడు.

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

జ) మాదంతా సినిమా ఫ్యామిలీనే. మా తాతగారు విజయ్ భట్ సినిమా దర్శకుడు. మా నాన్న అరుణ్ భట్ గుజరాతీ సినిమాలు ఎక్కువగా తీసేవారు. మా అంకుల్ సినిమాటోగ్రఫర్, నా కజిన్ కూడా సినిమాల్లోనే పనిచేస్తున్నాడు.

 
Like us on Facebook