మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి బ్రేక్ ఇవ్వనున్న రవితేజ

మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి బ్రేక్ ఇవ్వనున్న రవితేజ

Published on May 10, 2015 8:47 PM IST

ravitaja
ఎప్పటికప్పుడు టాలెంట్ ఉన్న కొత్తవారికి అవకాశం ఇవ్వడంలో ముందుండే హీరో మాస్ మహారాజ రవితేజ. ఇప్పటికే ఆయన పలువురు కొత్త దర్శకులకు, సాంకేతిక నిపుణులకు అవకాశం ఇచ్చాడు.
ఇప్పుడు తాజాగా మరో యంగ్ మ్యూజిక్ కంపోజర్ కి అవకాశం ఇచ్చాడు. ‘గాలిపటం’, కేవు కేక’, ‘అలా ఎలా’, ‘జోరు’ సినిమాలకు మ్యూజిక్ అందించిన యంగ్ మ్యూజిక్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియోకి తన నెక్స్ట్ మూవీ ‘బెంగాల్ టైగర్’కి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు.

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’ లోతమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తాజాగా భీమ్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసారు. సంపత్ నందికి భీమ్స్ మంచి స్నేహితుడు కూడా కావడం విశేషం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు