గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్

Published on Aug 10, 2022 12:32 am IST

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ప్రస్తుతం మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్. రెండేళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన అలవైకుంఠపురములో మూవీకి అద్భుతమైన సాంగ్స్ అందించి జాతీయ అవార్డు గెలుచుకున్న థమన్, ఇటీవల వరుసగా మరిన్ని సక్సెస్ లు అందుకున్నారు. ప్రస్తుతం థమన్ చేతిలో పలు బడా మూవీస్ ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే, తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన సినిమాల విషయాలు పంచుకునే అలవాటు గల థమన్ నిన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఫోటోలు పోస్ట్ చేసారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పార్క్ లో పలు మొక్కలు నాటిన థమన్, ఎంపీ సంతోష్ చేపట్టిన ఈ బ్రహత్కార్యంలో తాను కూడా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అలానే తన తరపున ఈ ఛాలెంజ్ ని ప్రముఖ సంగీత దర్శకులు మిక్కీ జె మేయర్, అనూప్ రూబెన్స్, కళ్యాణి మాలిక్ లకు అందించారు.

సంబంధిత సమాచారం :