తారక్ మరియు డిఎస్పీ లతో షో పై థమన్ వ్యాఖ్యలు

Published on Oct 31, 2021 3:32 pm IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు ఎంటర్ టైన్మెంట్ లో దూసుకు పోతుంది. ఈ దీపావళి పండుగ కి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కి ముఖ్య అతిధులుగా ప్రముఖ సంగీత దర్శకులు అయిన థమన్ మరియు దేవి శ్రీ ప్రసాద్ లు రానున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ఈ కార్యక్రమం పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

చాలా ఎక్కువ సేపు షూట్ జరిగిన ఎపిసోడ్ గా నిలుస్తుంది అని థమన్ అన్నారు. చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసొడ్ అంటూ చెప్పుకొచ్చారు. తారక్ అన్న చాలా బ్రిలియంట్ అని, దేవి శ్రీ ప్రసాద్ లతో క్రేజీ సమయం గడిపాం అని థమన్ వ్యాఖ్యానించారు. జెమిని టీవీ లో ప్రసారం అవుతున్న ఈ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ దీపావళి కి ఇందుకు సంబంధించిన ఎపిసొడ్ రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :