‘మిస్టరీ లైఫ్‌’ పై పూరి సరికొత్త పాఠం !

Published on Aug 15, 2021 10:07 pm IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో ఈ రోజు మరో సరికొత్త టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘మిస్టరీ లైఫ్‌’. మరి పూరి మాటల్లోనే ‘మిస్టరీ లైఫ్‌’ గురించి విందాం. ప్రతి ఒక్కరూ జీవితమంటే ఏమిటి? అసలు జీవితపరమార్థమేమిటి? అనే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

గురువులు, బాబాలు మన మధ్యనే ఉన్నారు. వాళ్లను మనం జీవితమంటే ఏమిటి ? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతుంటాం. కానీ, వాళ్లని మనం ప్రశ్నలతో విసిగించడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి ప్రశ్నలు తట్టుకోలేకే స్వామీజీలు ఎక్కువగా మనకు యోగా, ధ్యానం నేర్పిస్తారు. గుర్తు పెట్టుకోండి. లైఫ్‌ అనేది ఒక మిస్టరీ. దానిపై ఇన్వెస్టిగేషన్‌ చేయడం కంటే టైమ్‌ వేస్ట్‌ పని మరొకటి లేదు’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :