మైత్రీ నుండి ‘మత్తు వదలరా’ !

Published on Oct 17, 2019 6:55 pm IST

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఆల్ – న్యూ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లతో చేస్తోన్న న్యూ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘మత్తు వదరలారా’. కాగా తాజాగా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. పోస్టర్ వినూత్నంగా ఆకట్టుకునే విధంగా ఉంది. పోస్టర్ లో ఖైదీ సినిమాలోని మెగాస్టార్ గెటప్ ను, అలాగే సూపర్ మ్యాన్ గెటప్ లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గెటప్ ను ఎస్టాబ్లిష్ చేశారు. మరి సినిమా ఏ జోనర్ లో ఉండబోతుందో గాని, పోస్టర్ ను మాత్రం బాగా వైవిధ్యంగా డిజైన్ చేశారు.

కాగా ఇప్పుడు కొత్త తరహా కథాంశాలతో విల‌క్ష‌ణ‌మైన సినిమాలు నిర్మించడానికి న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటులు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ మైత్రీ సంస్థ‌ లో శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ , రంగ‌స్థ‌లం లాంటి భారీ విజయాలు వచ్చాయి, మరి రానున్న రోజుల్లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా వస్తాయోమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More