విజువల్ ట్రీట్ గా ఉండబోతున్న ‘నా నువ్వే’ !

తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నాలు జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. కొద్దిరోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో చిత్ర యూనిట్ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఆ ప్రయత్నాల్లో భాగంగానే సినిమాలోని ‘చినికి చినికి’ పాట యొక్క ప్రోమోను ఈ బుధవారం సాయంత్రం 5 గంటలు రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ పాట విజువల్ ట్రీట్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు షరత్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మే 25వ తేదీన ప్రేక్షకులకు అందివ్వనున్నారు.