వాయిదాపడిన ‘నా నువ్వే’ విడుదల !
Published on May 21, 2018 9:59 pm IST


త్వరలో విడుదలకానున్న సినిమాల్లో ప్రేక్షకుల కొంత ఎక్కువ ఆసక్తి చూపుతున్న చిత్రం ‘నా నువ్వే’. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేశారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటించారు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్, పాటలు బాగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా కూడ కొత్తగా ఉంటుందనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

ముందుగా చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన అది కాస్త వాయిదాపడింది. ప్రస్తుత సమాచారం మేరకు చిత్రాన్ని జూన్ 1న విడుదలచేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై నిర్మాతల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook