టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “నా సామిరంగ”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “నా సామిరంగ”

Published on Mar 17, 2024 4:07 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, అక్కినేని నాగర్జున (Akkineni nagarjuna) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ (Naa saamiranga). ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

నా సామిరంగ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా, టీవీ ప్రీమియర్ డేట్ ను అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి 24, 2024న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మర్నా మీనన్, నాజర్, షబీర్ కల్లరక్కల్ మరియు రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ విలేజ్ డ్రామాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు