నా పేరు సూర్య హిందీ వెర్షన్ కు సూపర్ రెస్పాన్స్ !

Published on Feb 4, 2019 10:24 am IST

వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ‘ గత ఏడాది విడుదలై విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈచిత్రం యొక్క హిందీ వెర్షన్ ‘సూర్య ది సోల్జర్’ ఈనెల 1న యూట్యూబ్ లో విడుదలై ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ ను , లక్షకు పైగా లైకులను రాబట్టుకుంది. ఇక బన్నీ నటించిన ‘సరైనోడు , డి జె’ హిందీ వెర్షన్ చిత్రాలు సౌత్ నుండి అత్యధిక రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ కు తెలుగు , మళయాళం తో పాటు హిందీ లోను మంచి మర్కెట్ క్రియేట్ అవుతుంది.

ఇక నా పేరు సూర్య తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో బన్నీ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :