సరికొత్త రికార్డ్ సృష్టించిన “నాటు నాటు” సాంగ్..!

Published on Dec 3, 2021 12:00 am IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ‘నాటు నాటు’ అనే మాస్ సాంగ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మాస్ అంతెం అరుదైన రికార్డును అందుకుంది. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన వీడియోగా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్రఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :