అల్లుడి మీదే ఆశలన్నీ పెట్టుకున్న హీరోయిన్

అల్లుడి మీదే ఆశలన్నీ పెట్టుకున్న హీరోయిన్

Published on Jan 5, 2021 9:17 PM IST

Nabha Natesh

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ కన్నడ భామ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ కమర్షియల్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. కానీ ఆ తర్వాత చేసిన ‘డిస్కో రాజా’ భారీ పరాజయం చెందడంతో నభా స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఇక ఈ ఏడాది ఆఖరులో విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ పాజిటివ్ ఫలితాన్ని అందుకోవడంతో ఆమె కొంత కుదుటపడింది.

కానీ మరోసారి ‘ఇస్మార్ట్ శంకర్’ స్థాయి హిట్ పడితేనే ఆమె కెరీర్ వేగం పుంజుకుంటుంది. అందుఎక్ ఆమె ఆశలన్నీ ‘అల్లుడు అదుర్స్’ మీదనే పెట్టుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాతి కానుకగా ఈ నెల 15న రిలీజ్ కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఓలా చిక్కా పాట మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమా మంచి హిట్ అయితే గట్టిగా స్థిరపడి పెద్ద సినిమాల ఆఫర్లను అందుకోవచ్చనేది నభా ఆశ. మరి ఆమె ఆశలను అల్లుడు ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి.

తాజా వార్తలు