ప్రభాస్ కోసం ఆ కథను 13ఏళ్ళు దాచాడట..!

Published on Jul 9, 2020 10:50 pm IST


టాలీవుడ్ లో మహానటి సినిమాతో గొప్ప దర్శకుడిగా అవతరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సావిత్రి జీవిత కథను ఆయన తెరపై ఆవిష్కరించిన తీరుకు అందరూ ఔరా అన్నారు. ఈ మూవీలో సావిత్రిగా నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ జాతీయ అవార్డు గెలుచుకుంది. కాగా ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ హీరో ప్రభాస్ తో ఓ భారీ చిత్రం ప్రకటించారు. కాగా ఈ మూవీ కథ గురించి ఆయన ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ 13ఏళ్ల క్రితమే ఈ కథ సిద్ధం చేసి ఉంచారట. అన్నేళ్ళుగా ప్రభాస్ కోసం ఆ కథను దాచిన నాగ్ అశ్విన్ ఇప్పుడు భారీగా తెరకెక్కించడానికి సన్నధం అవుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2022 సమ్మర్ విడుదల కానుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా పలుభాషలలో ఈ చిత్రం విడుదల కానుండగా…బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కెరీర్ లో మరో అద్భుత చిత్రంగా ఈ మూవీ నిలిచిపోనుంది.

సంబంధిత సమాచారం :

More