బంగార్రాజు అప్ డేట్ కోసం నాగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ !

Published on Jul 6, 2020 10:03 pm IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా ముందు వరుసలో నిలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఈ లోపు కరోనా రావడంతో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ లేకుండా పోయింది. దాంతో నాగ్ అభిమానులు బంగార్రాజు అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్లీజ్ అప్ డేట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరి మేకర్స్ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ కోసమైన అప్ డేట్స్ ఇస్తారేమో చూడాలి. అయితే అక్టోబర్ లో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. మరి నాగ్ ఈ సారి హిట్ కొడతారా చూడలి. అయితే నాగ్ గత సినిమా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన `మ‌న్మ‌థుడు 2′ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. దాంతో బంగార్రాజు పై మరింత కేర్ తీసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More