నాగార్జున, నానిల మల్టీ స్టారర్ మొదలయ్యేది ఎప్పుడంటే !
Published on Oct 19, 2017 8:40 am IST

మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్ లో మల్టీ స్టారర్ కూడా ఒకటి. ఈ పద్దతిని బాగా ఎంకరేజ్ చేస్తున్న వారిలో సీనియర్ స్టార్ హీరో నాగార్జున ముఖ్యులు. మంచి కథ, దమ్మున్న దర్శకులు దొరికితే నాగార్జునగారు ఎలాంటి మొహమాటం లేకుండా మల్టీస్టారర్ కు ఓకే చెప్పేస్తున్నారు. అలా ఆయన చేసిన సినిమాల్లో ‘ఊపిరి, రాజుగారి గది-2’ వంటి సక్సెస్ లు ఉన్నాయి. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగార్జున వరుస విజయల మీదున్న యంగ్ హీరో నానితో మల్టీస్టారర్ చేసేందుకు సిద్దమయ్యారట.

ఈ చిత్రాన్ని ‘భలేమంచి రోజు, శమంతకమణి’ లాంటి సినిమాల్ని తెరకెక్కించిన యంగ్ డైరెక్ట్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. అంతేగాక ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ నిర్మించనుందని, వచ్చేఏడాది జనవరి నుండి సినిమా మొదలవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తలపై ఖచ్చితమైన క్లారిటీ రావాలంటే నాగ్, నాని, వైజయంతి మూవీస్, శ్రీరామ్ ఆదిత్యల్లో ఎవరో ఒకరి నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి ఉండాల్సిందే.

 
Like us on Facebook