వర్మ సినిమాలో నాగార్జున రోల్ ఎలా ఉంటుందో తెలుసా !
Published on Nov 3, 2017 9:42 am IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో ఓక్ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 27 ఏళ్ళ క్రితం వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శివ’ చిత్రం ఇండస్ట్రీ దశ దిశను మార్చేయడంతో ఈసారి ఎలాంటి సినిమాను ఇస్తారో అనే ఆసక్తి, అంచనాలు అందరిలోనూ మొదలయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా నాగార్జునను ఇన్నేళ్ల తర్వాత వర్మ ఎలా చూపిస్తాడో తెలుసుకోవాలని అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు.

వాళళ్ కోసమే అన్నట్టు వర్మ సినిమలో తాను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నానని, సినిమా ఒక ఇంటెన్స్, స్టైలిష్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు నాగార్జున. ఆర్జీవీ స్వీయ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాను నవంబర్ 20 నుండి మొదలుపెట్టనున్నారు. మరి ‘శివ’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ఇద్దరు ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

 
Like us on Facebook