టైమ్ ఫిక్స్ చేసుకున్న నాగ్, ఆర్జీవి !
Published on Feb 24, 2018 2:55 pm IST

రామ్ గోపాల్ వర్మ, నాగార్జునలు కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి విధితమే. గతంలో వీరి కలయికలో ‘శివ, అంతం’ వంటి సినిమాలు వచ్చి ఉండటంతో ఈసారి రాబోయే చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకుంది.

ఈ చిత్రం యొక్క టైటిల్ విషయంలో ఇప్పటికే పలు పేర్లు వినిపించినా అసలు టైటిల్ ఏంటో రేపు రివీల్ కానుంది. టైటిల్ తో పాటే ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీలను కూడ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించనున్నారు. నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook