పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా శృతి హాసన్ (Sruthi Haasan) హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంకి భారీ సీక్వెల్ సలార్ 2(సలార్ శౌర్యంగ పర్వం) Salaar Shouryanga Parvam ని ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమాని కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేసి ముగించే పనిలో ఉన్నారు.
అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ లాజిక్ ఏమిటంటే ఈ చిత్రం షూట్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ అయ్యి ఈ ఏడాదిలోనే ముగుస్తుంది. దీనితో రిలీజ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే ఛాన్స్ లేదు. ఇది వరకే పార్ట్ 2 సంబంధించి కీలక సన్నివేశాలు పాట కూడా పూర్తయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ కి షూట్ పూర్తి అయినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఇంకో 5 నెలలు వేసుకున్నా కూడా వచ్చే ఏడాది వేసవి రేస్ లో ధారాళంగా సినిమాని తీసుకురావచ్చు.
కానీ ఏకంగా 2025 చివరికి లేదా 2026 రిలీజ్ అని కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడే ఫ్యాన్స్ కి కొంచెం లాజిక్ అర్ధం కావట్లేదు. నీల్ అన్ని పనులు ప్లానింగ్ ప్రకారం త్వరగానే పూర్తి చేసే దర్శకుడే అయినా సలార్ 2 ని ఇంత ఆలస్యంగా తీసుకురావడం అనేది ఆలోచించే విషయమే. మరి ఈ సినిమా రిలీజ్ పట్ల ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి.