“స్వయంభు” పై సాలిడ్ అప్డేట్..భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్

“స్వయంభు” పై సాలిడ్ అప్డేట్..భారీ బడ్జెట్ తో ఈ సీక్వెన్స్

Published on May 7, 2024 12:17 PM IST


టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఇప్పుడు మరిన్ని ఆసక్తికర సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “స్వయంభు” కూడా ఒకటి. మరి ఈ చిత్రంని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా నిఖిల్ కూడా ఈ సినిమా పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా కష్టపడుతున్నాడు.

అయితే ఈ చిత్రంపై లేటెస్ట్ గా నిఖిల్ ఓ సాలిడ్ అప్డేట్ ని అందించాడు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తాము చేస్తున్నట్టుగా తెలిపాడు, అలాగే థియేట్రికల్ గా ఒక గ్రాండ్ ట్రీట్ ని అయితే ఆడియెన్స్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపాడు. అయితే ఇప్పుడు చేస్తున్న సీక్వెన్స్ కి ఏకంగా 8 కోట్ల బడ్జెట్ ని మేకర్స్ పెట్టినట్టుగా వినిపిస్తుంది.

ఇక ఈ అప్డేట్ లోనే మరిన్ని సర్ప్రైజ్ అప్డేట్ లు రాబోతున్నాయి అని వరల్డ్ లోనే బెస్ట్ టెక్నికల్ టీం తో స్వయంభు ని తెరకెక్కిస్తున్నాము అని నిఖిల్ ఓ క్రేజీ పోస్టర్ తో పోస్ట్ చేసాడు. ఇక ఈ చిత్రంలో నటి సంయుక్త, నభా నటేష్ లు నటిస్తుండగా ఠాగూర్ మధు భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు