త్వరలో కొత్త సినిమాను ప్రకటిస్తానన్న నాగ చైతన్య !
Published on Feb 22, 2018 4:22 pm IST

అక్కినేని నాగ చైతన్య త్వరలో నూతన దర్శకురాలు, కృష్ణ వంశీ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన సౌజన్యతో ఒక సినిమా చేయనున్నాడని, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుందని వార్తలొచ్చాయి.

కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజంలేదన్నారు నాగ చైతన్య. ట్విట్టర్ ద్వారా రూమర్లపై స్పందించిన ఈయన ఉదయం నుండి నా కొత్త సినిమాపై వస్తున్న వార్తలు అవాస్తవం. ‘సవ్యసాచి’, మారుతిల సినిమాలు చేస్తున్నాను. అవి బాగా వస్తున్నాయి. ఈ ఏడాది కొత్త, మంచి కథలు విన్నాను. నా కొత్త సినిమాని త్వరలోనే నేనే స్వయంగా ప్రకటిస్తాను అన్నారు.

 
Like us on Facebook