నాన్నను యాక్షన్‌ చిత్రాలలో చూడడమంటే నాకు చాలా ఇష్టం – నాగ చైతన్య

Published on Sep 26, 2022 12:00 am IST

నాగార్జున ది ఘోస్ట్ అక్టోబర్ 5న దసరాకు విడుదల కానుంది. ఈరోజు కర్నూల్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్, దీనికి అఖిల్, నాగ చైతన్య లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ కర్నూలుకు రావడం ఇదే తొలిసారి అని, తన తండ్రి, అఖిల్ తో కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు.

తనకు అండగా నిలిచిన కర్నూలు అభిమానులందరికీ చైతన్య ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజుల్లో నాగార్జున ది ఘోస్ట్ గురించి మాత్రమే మాట్లాడేవాడని తెలిపారు. తన తండ్రి రెచ్చిపోవడం చూసి చాలా రోజులైంది అని, తన తండ్రిని తాను చూడాలనుకున్న విధంగా చిత్రీకరించినందుకు ప్రవీణ్ సత్తారుకు ధన్యవాదాలు తెలిపారు. యాక్షన్ చిత్రాలలో నాగార్జున ను చూడటం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అందుబాటులో ఉన్న వనరులతో అత్యధిక అవుట్‌ పుట్ ఇచ్చే వ్యక్తి ప్రవీణ్ సత్తారు అని ప్రశంశల వర్షం కురిపించారు. తాను పని చేసిన నిర్మాతలు సునీల్‌, రామ్‌మోహన్‌రావు, శరత్‌లు తనకు చాలా ఇష్టమని, మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :